English   

వైజాగ్ వెళుతున్న వెంకీమామ

venky mama
2019-07-01 11:36:07

జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ నాగచైతన్య కథానాయకులుగా వెంకీమామ సినిమా రూపొందుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకి వెళ్లింది. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్  చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ సినిమాలో రైస్ మిల్లు ఓనర్ గా వెంకటేశ్, మిలటరీ ఆఫీసర్ గా చైతూ కనిపించనున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ ఇటీవలే కాశ్మీర్‌లో జరిగిందట. ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనున్నట్లు తెలిసింది. దీనికోసం ఇప్పటికే రాశీఖన్నా వైజాగ్‌ చేరుకుందట. వెంకీ నిన్న రాత్రి ఓహ్ బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసారు. ఇక ఆయన కూడా ఈ షెడ్యూల్ కోసం ఈరోజు వైజాగ్ వెళుతున్నాడట. సురేశ్‌ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు మేకర్స్. మరి ఎఫ్ 2లో వరుణ్ తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ చేసి హిట్ కొట్టిన వెంకటేశ్ ఈసారి చైతూతోను కలిసి కూడా హిట్ కొడతాడో లేదో చూడాలి.

More Related Stories