English   

ఆసక్తి రేపుతున్న దొరసాని ట్రైలర్

Dorasaani Trailer
2019-07-01 12:09:23

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేరవకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం అవుతున్న సినిమా దొరసాని. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసింది యూనిట్. సుకుమార్ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. ‘రేపే నీ విడుదల కదా ’ అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. గడీలో ఉండే దొరసానితో కూలివాడి కొడుకు ప్రేమలో పడి, ఆ విషయం గడీలో తెలిసి వారిద్దరినీ విడతీసి అతన్ని ముప్పై ఏళ్ళు జైలులో ఉండేలాగా చేస్తారు, అదే ఈ సినిమా కధ. ఇక హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు, వారి మధ్య రొమాన్స్, లిప్ లాక్ లు వంటివి కూడా ఉన్నాయి ట్రైలర్ లో. ఇక ‘ఉద్యమంలో చావు కూడా ఒక విజయమే..’ అంటే, బదులుగా ఆనంద్ దేవరకొండ ‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని పలికిన డైలాగ్ అలాగే ఆర్ఆర్ ఈ సినిమా ట్రైలర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. మొత్తానికి ఈ ట్రైలర్ జులై 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరక్కెక్కుతున్న ఈ సినిమాతో కేవీఆర్ మహేంద్ర దర్శకుదిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
 

More Related Stories