English   

రాధిక, శరత్ కుమార్ లకి అరెస్ట్ వారెంట్

Raadhika Sarathkumar
2019-07-01 12:33:54

ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ మరో మారు చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ కోర్టుకి గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి వారిద్దరినీ అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది కోర్టు. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే గతంలో రాధిక, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ అనే వ్యక్తితో కలిసి చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వారు రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి రూ.2 కోట్లు ఫైనాన్స్ కి తీసుకున్నారు. ఆ తర్వాత అంతే మొత్తానికి చెక్ ఇవ్వగా అది బౌన్స్ కావడంతో రేడియన్స్ మీడియా సంస్థ  శరత్‌ కుమార్, రాధికా, లిస్టింగ్‌ స్టీఫెన్‌ లపై సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్‌ స్టీఫెన్‌లు రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు. అయితే కోర్టు ఆదేశాలతో అరెస్ట్ శరత్ కుమార్ – రాధిక లను అరెస్ట్ చేస్తారా ? లేక బెయిల్ తెచ్చుకుంటారా ? చూడాలి .

More Related Stories