English   

నక్కతోక కానీ తొక్కాడా ఏంటీ ?

Anand Deverakonda
2019-07-01 13:14:22

వీడెవడో నక్క తోక తోక్కినట్టున్నాడని సినిమాల్లోనో బయటో సామెతలు వింటుంటాం కదా, ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని చూస్తే అలానే అనిపిస్తుంది. ఈయన హీరోగా నటిస్తున్న సినిమా దొరసాని. ఈ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే విడుదలయిన టీజర్స్, ట్రైలర్స్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తున్నా, మనోడి లుక్ పరంగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ముందు ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని ఆగుతారు ఎవరైనా కానీ విజయ్ దేవరకొండ తమ్ముడితో రెండో సినిమాకి కూడా సైన్ చేయించేయడానికి ప్రయత్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ. వినోద్ అనే కొత్త దర్శకుడు విజయ్ దేవరకొండకు ఓ కథ చెప్పాడు. ఆ స్టోరీలో తన కంటే తన తమ్ముడైతే బాగుంటుందని, తమ్ముడికి కధ చెప్పమని పంపించాడట విజయ్. అలా వెళ్ళిన ఆ ప్రాజెక్టు సెట్ అయిందని గత కొంత కాలంగా హిట్స్ లేని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులైలో లాంచ్ కానుందని సమాచారం. ఇక జులైలో దొరసాని సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఆనంద్ దేవరకొండ రెండో సినిమాలో కూడా ఓ కొత్తమ్మాయి హీరోయిన్ గా లాంచ్ అవనుందట.

More Related Stories