English   

మహేష్ సినిమాకే ప్రొడక్షన్ కష్టాలు ?

 Sarileru Neekevvaru
2019-07-01 15:31:49

ఈ మధ్యనే అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ లో సినిమా మొదలయిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళాల్సి ఉన్నా, ఇంకా వెళ్లకపోవడానికి కారణం కొన్ని చర్చలే అని తెలుస్తోంది. ఆ చర్చల సారాంశం ఏంటంటే డబ్బు అట. నిజానికి ఈ సినిమాకి మహేష్ రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటారని మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తోంది. నిజానికి అలాగే ప్లాన్ చేశారట. అయితే సినిమాలో రెండు భారే సెట్స్ నిర్మించాల్సి ఉండడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని అందుకే ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ విషయం మీద చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమా థియేటర్ హక్కులు ఒక్కటే నిర్మాతలు అమ్ముకుంటారట. మిగిలిన శాటిలైట్, డిజిటల్ హక్కులు మహేష్ అమ్ముకుంటాడట. అయితే ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ కాస్ట్ ప్రకారం మహేష్ కి వచ్చే ఇబ్బంది లేదని, దిల్ రాజు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే కొంచెం మహేష్ తో సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాని మిలటరీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారు కాబట్టి కాశ్మీర్ లో కూడా షూట్ చేయాల్సి ఉంది. మరి ఈ ప్రొడక్షన్ వ్యవహారాలూ ఎప్పటికి తెగుతాయో, ఎప్పటికి సినిమా మొదలవుతుందో ? చూడాలి మరి.
 

More Related Stories