English   

పవన్ హీరోయిన్ కి ఆర్ధిక కష్టాలు....అరెస్ట్ ?

 Ameesha Patel
2019-07-01 17:51:05

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో పాటు బాలయ్య సరసన పరమవీరచక్ర లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన ముంబై భామ అమీషా పటేల్. అయితే ఇక్కడ మూడు నాలుగు సినిమాలు చేసినా పెద్దగా కాలం కలిసి రాక సొంత ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ క్లిక్ అయ్యింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది ఈ భామ. అయితే ఈమె దేసీ మ్యూజిక్ పేరుతో ఒక సినిమా మొదలెట్టింది. మొదలు పెట్టి ఏడేళ్ళు అవుతున్నా ఈ సినిమా ఏమైందో తెలీదు. అయితే ఈ సినిమా మొదలు పెట్టె సమయంలో అమీషా, అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి రూ.3 కోట్లు అప్పు తీసుకుందట. అయితే ఏడేళ్ళ సమయం దాటుతున్నా తన అప్పును చెల్లించకపోవడంతో ఆమెని ఎన్నో మార్లు అడిగిన అజయ్ కుమార్ ఆమె నుండి సరయిన స్పందన లేకపోవడం వలన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం నుండి బయట పెదేందుకు అమీషా పటేల్ మూడు కోట్ల మొత్తానికి ఒక చెక్ అజయ్‌కు ఇచ్చింది. అయితే అది ఆ చెక్ బౌన్స్ అవడంతో ముంబైలోని ఓ కోర్టు ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఆమె విచారణకు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని కోర్టు హెచ్చరికలు పంపింది. మరి ఈ అమ్మడు కోర్టుకు వెళ్తుందో లేక అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటుందో ? వేచి చూడాలి మరి.

More Related Stories