English   

అక్క సినిమా ఆగింది ! చెల్లికి అప్పుడే రెండో సినిమా ?

Shivatmika
2019-07-02 15:09:35

ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఉదాహరణకి జీవితారాజశేఖర్ ల కుమార్తెల విషయానికి వస్తే అది అర్ధం అవుతుంది. వీరికి ఇద్దరు కూతుళ్ళు అనే సంగతి తెలిసిందే. అయితే పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ గా 2 కంట్రీస్ అనే సినిమా మొదలయ్యింది అడివి శేష్ హీరోగా, ఏమయిందో ఏమో ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగిపోయాక ఆమె చెల్లెలు శివాత్మిక హీరోయిన్ గా ఒక సినిమా మొదలయ్యింది, అదే దొరసాని ఈ సినిమా రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే ఈ చిన్నమ్మడికి మరో ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు. అదేంటంటే దర్శకుడు సుకుమార్ ఒక పక్క స్టార్స్ తో సినిమాలు చేస్తూనే తన సిష్యులని దర్శకులుగా ప్రమోట్ చేయడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ కూడా ఏర్పాటు చేసి సినిమాలు తీసుతున్నారు. అలా వచ్చిన సినిమాల్లో ఒకటే కుమారి 21 ఫ్, చాలా బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని, కుమారి సినిమా తెరకెక్కించిన ప్రతాప్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని సమాచారం. సుకుమార్ కూడా ఈ పనుల్లో తలమునకలై ఉన్నాడట, అయితే ఈ సినిమాకి శివాత్మికని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారనే చర్చ కూడా మొదలయ్యింది. అందుకే నిన్న దొరసాని ట్రైలర్ లాంచ్ కి కూడా సుక్కూ వచ్చి బూస్టప్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. చూడాలి అక్క స్టార్ట్ కూడా అవ్వక ముందే చెల్లి రెండో సినిమా కూడా రిలీజ్ చేసేస్తుందేమో ? 

More Related Stories