English   

కీర్తి మరో ఇరవై రోజులు అక్కడేనా...

 keerthy suresh
2019-07-02 15:54:47

కీర్తి సురేష్ లేడీ లీడ్ గా నూతన దర్శకుడు నరేంద్రనాథ్ తెర‌కెక్కిస్తున్న సినిమాని ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల పీఆర్వో మహేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. కీర్తి సురేశ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ లేడీ ఓరిఎంటెడ్ సబ్జెక్ట్ సినిమా మొదటి షెడ్యూల్‌ ను జూన్‌ 11న స్పెయిన్‌లో స్టార్ట్‌ చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా ఆమె 45 రోజుల కాల్షీట్స్ కేటాయించిందట, దీని ప్రకారం కీర్తి మరో ఇరవై రోజులు స్పెయిన్‌లోనే గడపనున్నారు. అంటే ఆమె ఈ నెలాఖరు వరకు ఇండియా వచ్చే అవకాశమే లేదని సమాచారంరా. ఈ షెడ్యూల్‌ జూలై 26 వరకూ సాగనుందని తెలిసింది. ఇటీవలే సీనియర్ నటి నదియా, కీర్తీ సురేశ్‌లపై కీలక సన్నివేశాలను షూట్‌ చేశారట. నదియా పాత్ర షూటింగ్ పూర్తవగా ఆమె ఇండియా బయలుదేరిందట. అయితే మరో విశేషం ఏంటంటే ఈ స్పెయిన్‌ షెడ్యూల్‌ లోనే ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకోనుందట. ఇక ఈ సినిమాని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రాలు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి స‌ఖి అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేశారని కూడా ప్రచారం జరిగినా ఆ విషయం మీద క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా చేస్తున్న సినిమాలో కూడా కీర్తి నటిస్తోంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కీర్తికి బాలీవుడ్ డెబ్యూ మూవీ కానుంది.

More Related Stories