English   

ఏడాది తర్వాత కలిసిన ముగ్గురు స్టార్ హీరోలు

 Chiru Balayya
2019-07-02 17:20:28

టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ కలిసి ఒకచోట కనపడడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకరి సినిమా ఫంక్షన్ కి మరొకరు వస్తేనో, లేక పోతే ఏ ఫిలిం ఫేర్, సంతోషం లాంటి అవార్డ్ ఫంక్షన్ లలోనో మాత్రమే అది కుదురుతుంది. కానీ టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ముగ్గురూ కలిసి ఓకే చోట కనిపించడం చాలా అరుదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన టాలీవుడ్ నటీ నటుల క్రికెట్ పోటీల్లో కనిపించిన తరుపిస్తే ఇంకేమైనా ఉందా ? వారి అభిమానులకి పండగేగా. ఆ పండుగ నిన్ననే జరిగిందంట. నిన్న రాత్రి వీరు ముగ్గురూ కలిశారు. ఎందుకంటే నిన్న ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఇంట ఆయన 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ నేపధ్యంలో వీరు ముగ్గురూ హాజరయ్యారు. వీరు ముగ్గురికీ ఆయన సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ముగ్గురూ స్వయంగా హాజరయ్యి కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, ఎమ్మెస్ రాజు, సీనియర్ దర్శకులు బీ గోపాల్, కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి తదితరులు కూడా హాజరయ్యారు. ముగ్గురు హీరోలూ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గురూ గతేడాది జరిగిన సినిమా స్టార్స్ క్రికెట్ పోటీలలో కనిపించారు మళ్ళీ ఇప్పుడే కలిసి కనిపించడం.

More Related Stories