English   

విరాటపర్వం నుండి సాయి పల్లవి సైకిల్ లీక్డ్ పిక్

pallavi
2019-07-02 19:38:15

రానా, సాయిపల్లవిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం 1992’. వేణు ఉడుగుల దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్ఎల్వీ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ తెలంగాణాలో ధ‌రిప‌ల్లి అనే గ్రామంలో జ‌రుపుకుందని నిన్నటితో ఈ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ నుండి రానా షూట్ లో పాల్గొననున్నాడు. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ లో సాయి ప‌ల్ల‌వి పాల్గొన‌గా ఆమె సైకిల్ తొక్కుతున్న ఒక పిక్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో పల్లెటూరి పిల్ల‌ ఎలా ఉంటుందో అలానే ఉన్న సాయి పల్లవి సైకిల్ తొక్కుతున్న ఈ పిక్ అభిమానుల‌ని విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు, అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ ముఖ్య పాత్రలు పోషించ‌నున్న‌ట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ఆయనకీ సపోర్ట్ గానే ట‌బు పాత్ర కూడా నెగెటివ్ షేడ్ లో ఉంటుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా మొదలు కాక ముందు ఈ సినిమాలో సాయిపల్లవి, రానా ఇద్దరూ నక్సలైట్ల పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ మొదలయ్యాక మాత్రం రానా నక్సలైట్ గా సాయి పల్లవి పల్లెటూరి పిల్లగా కనిపిస్తారని, పల్లవి కోరిక మేరకు జనజీవన స్రవంతిలోకి వహ్హిన రానా ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా మారతాడట.

More Related Stories