English   

నటుడు శివాజీ అరెస్ట్...అమెరికా పారిపోతుండగా పట్టివేత

 Hero Sivaji
2019-07-03 11:09:28

ప్రముఖ నటుడు శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద టీవీ9 కొత్త యాజమాన్యం ఆయన మీద కేసు వేసింది. ఈయనా రవి ప్రకాష్ కలిసి ఒక ఒప్పందాన్ని ఎప్పుడో జరిగినట్టుగా చూపి కొత్త డైరెక్టర్ ల నియామకాన్ని అడ్డుకోవాలని చూసిందనేది వారు ఫైల్ చీసిన కంప్లైంట్ అయితే ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు అది నిజమేనని సాక్ష్యాలు సంపాదించారు. ఈ నేపధ్యంలో వీరిని విచారించడానికి కోర్టు 41 సీఆర్పీసీ ఉత్తరువులు జారీ చేసింది. అయితే ముందస్తు బెయిల్ కోసం రవి ప్రకాష్, శివాజీ ఇద్దరూ అప్ప్లై చేసుకోగా ఇద్దరికీ కోర్టు బెయిలు తిరస్కరించింది. ఈ నేపధ్యంలో రవిప్రకాష్ కోర్టు ముందు హాజరయినా ఈయన మాత్రం కాలేదు. దీంతో ఈయన పేరు మీద పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో దేశం దాటాలని చూసిన ఈయన గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం శివాజీని సైబరాబాద్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే సైబరాబాద్‌ పోలీసులు మాత్రం దేశం దాటి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నామని, ఆయనని అరెస్ట్‌ చేయమని, శివాజీని విచారణకు సహకరించాలని కోరామని చెబుతున్నారు.
 

More Related Stories