English   

రాజుగారిగదిలోకి వెళ్తున్న తాప్సీ 

Taapsee Pannu
2019-07-03 11:26:45

‘రాజు గారి గది’ సిరీస్‌ లో భాగంగా దర్శకుడు ఓంకార్ ఈ మధ్యనే రాజు గారి గది 3 అనే సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభం రోజే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించబోతుందని ప్రకటించడం, ఇక ఆమె ఆరోజుచిత్రం పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబుకు జంటగా ఆమె నటిస్తోంది అంటూ ప్రకటన చేశారు. అయితే అంతా బాగానే ఉండి మొదటి రోజు షూట్ కి వెళ్తే కధ విషయంలో మార్పులు ఒప్పుకోలేదన్న కారణంతో ఆమె తప్పుకుంది. దీంతో ఆమె తప్పుకోవడంతో ఓంకార్ పలువురు హీరోయిన్లను సంప్రదించారు. పలువురిని పరిశీలించిన తర్వాత దర్శకుడు ఓంకార్‌కు హీరోయిన్‌గా తాప్సీ అయితే బాగుంటుందని అనిపించిందట. ఈ మధ్యనే ఈ  భామ వరుసగా హారర్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన గేమ్ ఓవర్ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అందుకే ఓంకార్ ఆమెను సంప్రదించినట్లు, ఆమె ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే ఆమెను చిత్ర బృందం కలిసిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. అయితే ముందుగా నందిత శ్వేతను తీసుకోవాలని మొదట భావించినప్పటికి ఆమెకు పెద్దగా మార్కెట్ లేదని అందుకే తాప్సీనే బెటర్ అని అనుకున్నట్టు చెబుతున్నారు. 

More Related Stories