English   

ఇస్మార్ట్ గా గుమ్మడి కాయ కొట్టారు...ట్రైలర్ రిలీజయ్యాకే ?

 Ismart Shankar
2019-07-03 12:01:56

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా షూటింగ్ నిన్ననే పూర్తయ్యిందట, ఈ విషయాన్ని ప్రకటించింది సినిమా యూనిట్. ఇక షూట్ పూర్తి కావడంతో గుమ్మిడికాయ కొట్టేశారట. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జూలై 18న ఈ చిత్రం విడుదల చేస్తామని ముందే ప్రకటించడంతో ఆ మేరకు పని చేస్తున్నారు. హిట్ కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న పూరీ, రామ్ లు ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తవ్వ లేదట. ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక వచ్చే క్రేజ్ బిజినెస్ కి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. అయితే జూలై 19న డిస్నీ 'ది లయన్ కింగ్' సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇస్మార్ట్ మీద లయన్ కింగ్ ప్రభావం ఏమేరకు ఉంటుందో వేచి చూడాలి. 
 

More Related Stories