English   

రావణ్ గా మారుతున్న తుగ్లక్ 

 Kalyan Ram
2019-07-03 15:59:58

నూతన దర్శకుడు మల్లిడి వేణుతో కల్యాణ్ రామ్ ఒక సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతన్న ఈ సినిమాకి గతంలో తుగ్లక్ అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఈ టైటిల్ కాస్త ఫన్నీగా ఉండడమే కాక కథకి తగినట్టుగా అనిపించడం లేదని భావించిన ఈ సినిమా యూనిట్ సినిమా కథకి తగినట్టుగా పవర్ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. అలా టైటిల్ కోసం ఎన్నో రోజులు గట్టిగా కసరత్తులు చేసి, చివరికి రావణ అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా గతంలో తారక్ నటించిన జై లవకుశ సినిమాలో రావణ పాట ఎంత పాపులర్ అయిందో అందరికే తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ పాట టైటిల్‌ తోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేస్తున్నారన్న మాట. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా షూట్ లో ఉండగానే ఈ సినిమా కూడా ప్రప్రంభం  అయ్యే అవకాశం వుందని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. త్వరలోనే క్యాస్ట్ అండ్ క్రూ ఎంపిక పూర్తి చేసి ప్రకటన చేయచ్చని అంటున్నారు.

More Related Stories