English   

చిరుకి పోటీగా విక్టరీ వెంకటేష్...మేనల్లుడి సపోర్ట్ 

Venky Mama
2019-07-03 17:27:58

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా కోసం అభిమానులే కాక సినీ ప్రేమికులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ళ క్రితం ఈ సినిమా మొదలుపెట్టడం ఇన్ని రోజులకి కూడా బయటకు రాకపోవడంతో ఈ సినిమా మీద జనానికి ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా కలిసొచ్చేలాగా రిలీజ్ చేస్తున్నట్టు అనధికారికంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే మెగాస్టార్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా రిలీజయ్యేప్పుడు మరే సినిమాని కూడా విడుదల చేయడానికి పెద్దగా ఇష్టపడడంలేదు నిర్మాతలు. అయితే వెంకటేష్-నాగచైతన్యల మల్టీ స్టారర్ వెంకీ మామ సినిమా దసరా కానుకగా రిలీజవుతుందని ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలు లీకులు వదులుతున్నారు. జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో వెంకటేష్ నాగచైతన్య కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‌ గా రూపొందుతున్న వెంకీ మామ సినిమాలో నాగచైతన్య మిలటరీ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరిగినా దాని మీద క్లారిటీ లేదు. అయితే ఈ సీన్స్ కోసమే ఈ సినిమా యూనిట్ పాటు కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంది. ఇక తాజా షెడ్యూల్‌ వైజాగ్‌లో షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఇంకా రెండు నెలలు సమయం ఉండడంతో ఎలా అయినా పూర్తి చేసి ఈ సినిమాని సైరా కంటే ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఒకటి రెండ్రోజులు ముందుగా లేకుంటే, ఒకటి రెండ్రోజులు ఆలస్యంగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే విషయం మీద నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. రెండు వేరు వేరు జోనర్ సినిమాలు కావడంతో ఈ సాహసానికి పూనుకుంటూన్నట్టు చెబుతున్నారు. ఎటూ దసరా సెలవులు కలిసి వస్తాయి కాబట్టి తమకు ఎటువంటి నష్టం ఉండదని భావిస్తున్నట్లు టాక్. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories