English   

ఇస్మార్ట్ శంక‌ర్ ట్రైల‌ర్ టాక్.. పూరీ, రామ్ హైద‌రాబాదీ బిర్యానీ.. 

 Ismart Shankar
2019-07-03 17:50:25

ఓ పిల్లా నువ్ ఊ అంటే గొల్కొండ రిపేర్ జేసి నీ జేతుల పెడ్తా.. భేగం చేసి ఖిల్లా మీద గూస‌బెడ్తా.. 
పిల్లి గుడ్డిదైతే ఎల‌క ఎగిరెగిరి చూపించిందంటా.. 
అన్నా పోలీసులు నీ డిప్ప‌కు బొక్క పెట్టింర్రంట‌.. 
దీన్త‌ల్లి నా దిమాక్ ఏందిరా డ‌బుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్కుంది.. 
నీ జాతిల నా పుల్ల‌.. 
బొక్క వెట్టుడేందిరా.. 
నేను జైలు నుంచి త‌ప్పించుకుంది బార్కాస్ బిర్యానీ తిన్నీక గాదు.. యాట కొయ్య‌నీకే.. నా యాట నువ్వే.. ఇలా ఒక‌టా రెండా ట్రైల‌ర్ నిండా బుల్లెట్స్ లా డైలాగులు వ‌దిలేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. రామ్ తో ఈయ‌న చేస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగానే అనిపిస్తుంది. ప‌క్కా హైద‌రాబాద్ బిర్యానీ తిన్న‌ట్లు మాస్ మాస్ గా ఉంది ఈ ట్రైల‌ర్ అంతా. ఇక రామ్ కూడా ఇదివ‌ర‌కు ఏ సినిమాలో లేనంత మాస్ గా క‌నిపిస్తున్నాడు. గ‌న్స్, మాఫియా, హీరోయిన్ల అందాలు.. ఇలా అన్నీ ఈ సినిమాలో కూడా క‌నిపిస్తున్నాయి. పోలీసులు రామ్ బుర్ర‌లో చిప్ పెట్ట‌డం ఒక్క‌టే ఇందులో కొత్త విష‌యం. డ‌బుల్ దిమాక్ తో రామ్ ఏం చేసాడు అనేది అస‌లు క‌థ‌. ఈ సినిమా కోసం రామ్ కూడా పూర్తిగా హైద‌రాబాదీ స్టైల్లోకి మారిపోయాడు. తెలంగాణ యాస‌లో ఇర‌గ‌దీసాడు. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటాష్ న‌టిస్తున్నారు. నిధి కాస్త సైలెంట్ గా ఉన్నా కూడా న‌భా మాత్రం పూర్తిగా ఇస్మార్ట్ పోరీ అయిపోయింది. వ‌రంగ‌ల్ కాలేజీల పోర‌గాళ్ల‌తో ఉచ్చ పోయించిన అంటూ మాస్ డైలాగులు చెప్పింది ఈ ముద్దుగుమ్మ కూడా. మ‌రి టెంప‌ర్ త‌ర్వాత హిట్ లేని పూరీ జులై 18న రాబోయే ఇస్మార్ట్ శంక‌ర్ తో ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories