English   

తమ్ముడికి విజయ్ దేవరకొండ ఎందుకు సాయం చేయడం లేదు..

Anand Deverakonda
2019-07-03 18:29:17

సాధారణంగా ఒక కొత్త వారసుడు వస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి అతని ప్రమోట్ చేస్తుంటారు. ఆయన సినిమా కోసం తమకు చేతనైన సాయం చేస్తుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం.. ట్రైలర్ విడుదల చేయడం.. టీజర్ విడుదల చేయడం.. అలా ఆ సినిమాకు తమ క్రేజ్ జత చేయడానికి దాదాపుగా ప్రయత్నిస్తుంటారు. చాలామంది కొత్త హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. మొన్నటికి మొన్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఓపెనింగ్ మెగా ఫ్యామిలీ హీరోలు వచ్చారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ మాత్రం ఇదేమీ చేయడం లేదు. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. కొత్త దర్శకుడు కె.వి మహేంద్ర దీన్ని తెరకెక్కించాడు. నైజాం నవాబుల నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఒక పెద్దింటి అమ్మాయిని ఒక తక్కువ జాతి కుర్రాడు ప్రేమిస్తే ఏమవుతుంది.. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు ఏర్పడ్డాయనే ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కె.వి.ఆర్ మహేంద్ర. ఇదంతా బాగానే ఉంది.. కానీ ఇప్పటివరకు ఆనంద్ దేవరకొండ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. తన స్టార్ పవర్ తమ్ముడి కోసం అస్సలు వాడడం లేదు ఈ హీరో. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కనీసం టీజర్ విడుదల చేసినప్పుడు కానీ ట్రైలర్ విడుదల చేసినప్పుడు కానీ విజయ్ దేవరకొండ సీన్ లో కూడా లేడు. కావాలనే తమ్ముడు సినిమా విషయంలో దూరం దూరంగా ఉంటున్నాడా.. మీద పడి ప్రమోషన్ చేస్తే అనవసరంగా సొంత డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందని దూరంగా జరుగుతున్నాడా అనేది అర్థం కావడం లేదు. కారణం ఏదైనా కావచ్చు కానీ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ అసలే మాత్రం ప్రమోషన్ చేయకపోవడం కాస్త విడ్డూరంగా ఉన్న విషయం. ఈయన తన డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడిప్పుడు.

More Related Stories