English   

బుర్రకధకి తొలగిన అడ్డంకులు...సెన్సార్ పూర్తి 

 Burra Katha
2019-07-04 11:45:26

చాలా కాలంగా హిట్ కోసం పరితపిస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడిగా మారుతున్న డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన విభిన్న కధాంశంఉన్న సినిమా బుర్రకథ. వాస్తవానికి ఈ సినిమా గత నెల 28నే రిలీజ్ కావాల్సి ఉన్నా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వలన రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాతి రోజున రిలీజ్ చేస్తున్నామని ఆరోజున ప్రకటించినా ఆ తర్వాతో రోజుకు కూడా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో ఏకంగా మరో వారానికి అంటే జూలై 5కి ఈ సినిమా వాయిదా పడింది. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే. అయితే ఈ డేట్ కూడా దగ్గర పడడంతో ఈ సినిమా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్నారు యూనిట్. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ అందించగా ఈ సినిమా రన్‌టైం 2 గంటల 6 నిమిషాలుగా పేర్కొన్నారు. ఈ మద్యనే రిలీజయిన ఈ సినిమా ట్రైలర్ లో ఈ హీరో రెండు మైండ్స్ ఉన్నవాడిగా చూపబడడంతో ఈ సినిమా మీద అంచనాలు, విపరీతమైన ఆసక్తి రేకెత్తింది. ఇక ఆది సరసన మిష్టీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు. ఇదే రోజున సమంతా ఒ బేబీ కూడా రిలీజ్ అవుతుండగా పోటీ కూడా గట్టిగానే ఉంటుంది, మరి ఆదికి ఈ సినిమా అయినా హిట్ కోడతాడేమో చూడాలి మరి.

More Related Stories