English   

నితిన్ సినిమా ఆగిపోయిందా ?

Nithin
2019-07-04 11:51:15

ఈ మధ్య కాలంలో ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్, మళ్ళీ బ్యాంగ్ లోకి వచ్చి వరుసగా సినిమాలు ప్రకటించాడు. ప్రకటించడమే కాక వరుసగా సినిమాలు లాంచ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెండీ కుడుములతో ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా, వెంకీ అట్లూరితో మరో సినిమా ప్రకటించారు. అయితే నితిన్ ఎంత త్వరగా సినిమా లాంఛ్ చేశాడో అంతే త్వరగా ఆ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. నితిన్-చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఓ సినిమా మొదలయ్యింది. అయితే ఈ సినిమా తెరకేక్కడం మీద నీలి నీడలు కమ్ముకున్నాయని అంటున్నారు. ఎందుకంటే ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతుందనే కారణంతో ఈ సినిమా నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. సెట్స్ మీదకి వెళ్తుందనే సమయంలో బడ్జెట్ తెగకపోవడంతో ఈ సినిమా భవితవ్యం మీద నీలి నీడలు కమ్ముకున్నట్టు చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో లేడీ లీడ్స్ గా నటించనున్నారని కూడా ప్రచారం జరిగింది, అయితే ఇప్పుడు మొదటికే మోసం వచ్చినట్టు చెబుతున్నారు, చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories