English   

సెన్సార్ పూర్తి చేసుకున్న ఓ బేబీ 

Oh Baby
2019-07-04 12:11:27

క్యూట్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా అలా మొదలయింది ఫేం డైరెక్టర్ నందిని రెడ్డి రూపొందిస్తున్నఓ బేబీ ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజవుతోంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ‌కి తెలుగు రీమేక్‌ గా తెరకెక్కిన ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే రిలీజయిన ఈ సినిమా ట్రైలర్, టీజర్స్ ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. ట్రైలర్ లో సమంతా నటనకే అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తితో ఉన్నారు. ఓ ఫోటో స్టూడియోలో ఫోటో దిగడానికి వెళ్ళిన 70 ఏళ్ల బామ్మ ఏదో అద్భుతం జరిగి పాతికేళ్ళ భామగా మారిపోతుంది. ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త లైన్ లా అనిపించడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సెన్సార్ పూర్తి చేసుకుంది.  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది.  ఇక ఈ సినిమాలో బామ్మగా సీనియర్ నటి లక్ష్మి కాగా పాతికేళ్ళ భామగా సమంతా నటిస్తోంది. నాగ శౌర్య, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, తేజ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమా రిలీజ్ చేస్తున్నారు. 

More Related Stories