English   

మరీ ఇంత తొందరైతే ఎలా రాజశేఖర్ 

 Rajashekhar
2019-07-04 12:21:59

రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా చేస్తున్న దొరసాని సినిమా ఈనెల 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా జనాన్ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ సూపర్ గా ఉండటంతో పాటు శివాత్మిక హావభవాలు కూడా బాగున్నాయని జనాలు అనుకుంటున్నారు. ఈ మాటలను ఎలా అర్ధం చేసుకున్నారో ఏమో కానీ రాజశేఖర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే తనకు తానుగా అనకుండా జనాల పేరు చెప్పి తన కూతురిని సావిత్రితో పోల్చేశాడు యాంగ్రీ యంగ్ మాన్ . ఈమె తెరంగ్రేటం చేస్తున్న ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. కేవలం టీజర్, ట్రైలర్‌ లను చూసి సావిత్రితో పోలుస్తున్నారని చెప్పడం అంటే అత్యుత్సాహ ప్రయత్నమే అనాలి. మహానటి సావిత్రికి వచ్చిన పేరు ఒక్క సినిమాతో తెచ్చుకుంది కాదు, ఎన్నో రోజుల ఆమె కష్టానికి ప్రతిఫలం. సౌందర్య లాంటి హీరోయిన్ కూడా ఆమెతో పోల్చబడింది కానీ ఆమె సరసన చేర్చబడలేదు. అలాంటి కేవలం ఫస్ట్ సినిమా అది కూడా రిలీజ్ కాని సినిమా. భావాభావాలు బాగున్నాయని అన్నంత మాత్రమే ఏకంగా మహానటితో పోల్చడం ఏంటని ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. కనీసం సినిమా రిలీజ్ అయ్యేవరకైనా రాజశేఖర్ ఆగి ఉంటె బాగుండేది ఏమో ?

More Related Stories