English   

వాయిదా పాడనున్న రాజ్ ధూత్....థియేటర్ల కష్టాలు 

Rajdoot
2019-07-04 12:28:37

రియల్ స్టార్‌, దివంగత నటుడు శ్రీహరి రెండో కొడుకు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న సినిమా రాజ్‌దూత్‌. నక్షత్ర, ప్రియాంక వర్మ కూడా హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి అర్జున్‌ – కార్తీక్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా ఈ శుక్రవారం అంటే రేపు రిలీజ్ అవుతున్నట్టు ముందే సినిమా యూనిట్ ప్రకటించారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి కూడా చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు. దానికి కారణం ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు కేవలం ఓ బేబీ ఒకటే పోటీలో ఉంది, కానీ అనుకోని కారణాల వలన పోటీలో వెనకపడ్డ ఆది బుర్రకధ సినిమా కూడా ఈ వారానికి వచ్చి చేరింది. దీంతో థియేటర్స్ సరిగా దొరకకపోవడంతో ఈ సినిమా మరో వారం రోజులు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అదీ కాక ఈ సినిమా ఇంకా సెన్సార్ పూర్తి చేసుకోలేదు, ఓకవేళ ఈ రోజు సెన్సార్ వాళ్ళకి చూపి రేపు రిలీజ్ చేద్దామని అనుకున్నా థియేటర్స్ సమస్య ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళడానికి యూనిట్ సిద్దమయ్యిందని అంటున్నారు. రేపు రిలీజ్ అనుకున్న ఇంకా ఆన్ లైన్ బుకింగ్ కూడా ఓపెన్ చేయక పోవడం దీనికి ఊతం ఇస్తోంది. ఈ లెక్కన ఈ సినిమా జులై 12కి షిఫ్ట్ అవుతుంది, ఆరోజున కూడా దొరసాని సినిమా రిలీజ్ కి ఉంది, అయినా రెండు సినిమాలు థియేటర్స్ షేరింగ్ అంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ఈరోజు ఈ సినిమా వాయిదా వేస్తున్నామన్న ప్రకటన రానున్నట్లు చెబుతున్నారు.

More Related Stories