English   

ఈరోజు నుండి సెట్స్ మీదకు సరిలేరు నీకెవ్వరూ...బాధతోనే !

 Sarileru Neekevvaru
2019-07-04 12:48:26

మహర్షి విజయం తర్వాత లాంగ్ వెకేషన్ బ్రేక్ తీసుకున్న మహెష్ ఇటీవలే ఇండియా తిరిగొచ్చిన సంగతి తెలిసిందే, అయితే తన పినతల్లి మృతి చెందడంతో తండ్రి దగ్గరే ఉంటున్నాడు మహేశ్. అయితే ముందే ప్లాన్ చేసిన కాశ్మీర్ షెడ్యూల్ ఈరోజు నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆయన తండ్రి వద్ద నుండి షూట్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహేష్ ఈ సినిమాలో నటించేది ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో కాశ్మీర్‌ లో ఆ ఆర్మీకి సంబందించిన కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే మరో కొందరు మతీనతులు కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. అంతేకాక ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఆర్మీ బ్యాక్ డ్రాప్ సాంగ్ కూడా అక్కడే షూట్ చేయనున్నట్టు చెబుతున్నారు. షూట్ కూడా మొదలు కాక ముందే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో షూట్ కి ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. రష్మిక మందన్నా లేడీ లీడ్ గా నటిష్టున్న ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ  సినిమాని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఇక ఎప్పటిలానే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

More Related Stories