మళ్ళీ ఆగిన ఆర్ఆర్ఆర్....ఈసారి జక్కన్నకి ?

మొదలయిన నాటి నుండి ఏదో ఒక రూపంలో అనేక బ్రేక్స్ ఎదుర్కొన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో బ్రేక్ తప్పేలా లేదు. ఏంటో అట్టహాసంగా మొదలయిన ఈ షూట్ లో చరణ్ గాయపడ్డాడని కొన్ని రోజులు, ఎన్టీఆర్ గాయపడ్డాడని కొన్ని రోజులు షూట్ ఆగింది. అన్నీ కుదురుకుని ఈ మధ్యనే కాస్త గాడిలో పడిందిరా అనుకున్న సమయంలో మరో బ్రేక్ పడింది. అయితే ఈసారి కారణం చరణ్, ఎన్టీఆర్ లు కాదు, జక్కన్నే. వామ్మో ఆయనకి ఏమయిందని ఖంగారు పడకండి, ఆయనకేమీ కాలేదు, జక్కన్నకి పర్సనల్ పనులు ఉండడంతో ఆయన అమెరికా వెళుతున్నాడట. అందుకే ఈ సినిమా షూట్ కి బ్రేక్ పడనుందని అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమారుడు ఈ సినిమా ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగిందని, కొన్ని ముఖ్యమైన సీక్వెన్స్ షూట్ చేశమని పేర్కొన్న ఆయన కాని కొన్ని కారణాల వల్ల చిన్న బ్రేక్ ఒక వారం పాటు సినిమా షూటింగ్ ఆపేస్తున్నామని ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అయితే ఎందుకు ఆగిందో మాత్రం కార్తికేయ తెలియజేయలేదు. ఈ విషయం మీద రాజమౌళి కూడా ఓ ట్వీట్ చేశాడు. తాను అమెరికా వాషింగ్ టన్ లో ఉన్నానని ఇది వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నాడు. తాను తానా సభలకు వెళ్ళడం లేదని, పెద్దన్న మ్యూజిక్ షోకి కూడా కాదని పేర్కోన్న ఆయన తాను తానా సభలకు వస్తున్నానని ఆశిస్తున్న ప్రజలు అర్ధం చేసుకోవాలని ట్వీట్ చేశాడు. అలా వారం రోజులు చరణ్, ఎన్టీఆర్ లకి బ్రేక్ దొరికిందన్నమాట.