అప్పుడే షూట్ అంటున్న నాగశౌర్య...నేటి నుండే

ఈ మధ్య కాలంలో హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఐరాక్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం 3 సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా ఒక రిస్కీ స్టంట్ చేస్తున్న నేపధ్యంలో నాగశౌర్య కాలికి గాయం అయితే చికిత్స తీసుకుని హైదరాబాద్ లోని ఇంటికి చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. నిజానికి ఆయనకీ చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. ఆయనకీ మరికొన్ని రొజూ డాక్టర్ లు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారు. కానీ శౌర్య ఈరోజు నుండి షూట్ లో పాల్గొంటున్నాడు. కుటుంబ సభ్యులు, యూనిట్ ఎంత చెప్పినా వినని శౌర్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఈయనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ ల డేట్స్ వృధా అవుతాయని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా షూట్ ఈరోజు నుండి హైదరాబాద్ లోని మలక్పేట ప్రాంత్రంలో మెదలయ్యింది. దానికి సంబందించి ఫోటోలను యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక మరోపక్క కాగా సమంత ప్రధాన పాత్రలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన “ఓ బేబీ” రేపు విడుదల కానుంది.