English   

కొర‌టాల శివ‌, చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. 

 Nayanthara
2019-07-04 18:47:45

చిరంజీవి కొరటాల సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమా ఆగ‌స్ట్ నుంచి ప‌ట్టాలెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. దీనిపై ఆ మ‌ధ్య అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది కొణిదెల ప్రొడ‌క్ష‌న్ టీం. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. దీనికి సమాధానం మరోసారి సైరా హీరోయిన్ నే నటించబోతుంద‌ని తెలుస్తుంది. కొరటాల సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటించబోతుందని ప్ర‌చారం జ‌రుగుతుంది. కథ నచ్చడంతో నయన కూడా ఓకే చెప్పేసింది. దానికి తోడు పారితోషికం కూడా భారీగా అందుతుండటంతో నయనతార సై అనేసింది. సైరాలో న‌టిస్తున్న ఈ భామ‌నే మ‌రోసారి తన సినిమాలో రిపీట్ చేయాలని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొరటాల శివ. ఇప్ప‌టికే క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. ఈ చిత్రం నిరుద్యోగం నేప‌థ్యంలో తెరకెక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ప్రభుత్వంపై సెటైర్లు వేసే విధంగా ఈ పాత్రను కొరటాల డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాన‌ని కనిపిస్తున్నాడు మెగాస్టార్. అన్ని కమర్షియల్ హంగులతో కొరటాల శివ, చిరంజీవి సినిమా రాబోతుంది. 2020 మార్చిలో సినిమా విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలి కొరటాల శివ సినిమాలో చిరంజీవితో ఎవరు జోడి కట్టబోతున్నారో..?
 

More Related Stories