English   

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రు.. మాజీ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ntr
2019-07-04 21:32:45

అవునా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రో తెలియదా..? తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో.. పైగా నెంబ‌ర్ వ‌న్ రేసులో ఉన్న సూప‌ర్ స్టార్.. ఇప్ప‌టికే పాతిక సినిమాలు పూర్తి చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే ఎవ‌రో తెలియ‌ని వాళ్లుంటారా..? అందులోనూ మాజీ ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా ఉంటుందా.. కానీ ఇదే విచిత్రం ఇప్పుడు జ‌రిగింది. నిజంగానే త‌న‌కు ఎన్టీఆర్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఓ మాజీ సీఎం. అత‌నెవ‌రో కాదు.. నాదెండ్ల భాస్క‌ర‌రావు. ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీ పెట్టించి.. ఆయ‌న‌కు మొద‌ట్లో అండ‌దండ‌గా ఉండి.. ఆ త‌ర్వాత వెన్నుపోటు దారుడిగా ముద్ర వేయించుకున్నాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు టీడీపీ ప‌థ‌న‌మైపోయిన తీరు చూసి ఆయ‌న కూడా స్పందించాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తే కానీ ఇప్పుడు తెలుగుదేశం మ‌ళ్లీ నిల‌బ‌డ‌ద‌ని.. ఆయ‌న వ‌స్తేనే పార్టీకి పున‌ర్వైభవం వ‌స్తుంద‌ని అంతా అంటున్నారు.
పార్టీ నేత‌లు కూడా ఇదే అభిప్రాయ‌ప‌డుతున్నారిప్పుడు. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన నాదెండ్ల‌ను కూడా ఈ విష‌యం గురించి అడిగారు. దానికి ఊహించ‌ని స‌మాధానం ఇచ్చాడు నాదెండ్ల‌. అస‌లు త‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని.. తాను సినిమాలు చూడ‌న‌ని చెప్పాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన గురించి కూడా మాట్లాడ‌న‌ని చెప్పాడు నాదెండ్ల భాస్క‌ర‌రావు. ఆ పార్టీలో ఈయ‌న కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నాడు. ఈయ‌న అందులో చేర‌డాన్ని కూడా త‌ప్పు ప‌ట్టాడు నాదెండ్ల‌. మొత్తానికి ప‌వ‌న్ పార్టీ సంగ‌తి ఎలా ఉన్నా కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌దు అని చెప్ప‌డం మాత్రం నిజంగా విడ్డూర‌మే. దీనిపై ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.

More Related Stories