English   

నయనతార డైరెక్టర్ తో సమంతా ?

Samantha Akkineni
2019-07-05 09:32:00

పెళ్లి అయ్యాక సోషల్ మీడియాలో అందాలు ఒలకబోస్తున్న సమంతా అక్కినేని సినిమాల్లో మాత్రం ఎంతో పద్ధతిగా ఉంటోంది. ఆమె అక్కినేని కోడలు కావడంతో అందుకు తగ్గ పాత్రలే వస్తున్నాయి. ఆ కోవలో వచ్చినవే యూ టర్న్, మజిలీ త్వరలో రానున్న ఓహ్ బేబీ. అయితే ఆమెకు తమిళనాట క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు జయలలితను పిలుచుకున్నట్టే ఈమెను కూడా తలైవి అని పిలుచుకుంటున్నారు అంటే ఆమె క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆమెకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ఆ  వార్త ఏమిటంటే, ఆమె తమిళ్ లో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. గత ఏడాది నయనతారతో అరమ్(తెలుగులో కర్తవ్యం) సినిమాని తెరకెక్కించిన గోపి నయనార్ డైరెక్షన్లో సమంతా ఓ లేడీ ఒరిఎంటేడ్ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తమిళ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక అరమ్ సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదలై సక్సెస్ సాధించింది. నయనతార ఐఏఎస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా పిల్లలు బోరుబావిలో పడితే ఆ తీసే క్రమాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ నయనార్ సమంతతో ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నారట. అయితే లైన్ సమంతాకి చెప్పారని ఆమె ఓకే కూడా చెప్పారని అంటున్నారు. అధికారిక ప్రకటన వస్తే కానీ దీని మీద క్లారిటీ రాదు.

More Related Stories