English   

రామ్ కి జోడీగా నివేతా 

nivetha
2019-07-05 10:38:21

చాలా కాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పూరీతో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితమే షూట్ కి గుమ్మడి కాయ కొట్టేసిన ఈ సినిమా మీద రామ్ అలాగే పూరీ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు రామ్ తర్వాత సినిమా మీద కూడా అప్పుడే ద్రుష్టి పెట్టినట్టు చెబుతున్నారు. రామ్ ఒక తమిళ్ రీమేక్ సినిమా మీద కన్నేశాడని కొన్నాళ్ళ క్రితం ప్రచారం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విషయం నిజమేనని తాజా సమాచారం. మగిళ్ తిరుమేని డైరెక్షన్  అరుణ్ విజయ్ నటించిన ‘తడం’ తమిళ్ లో మంచి విజయం సాధించింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ముందుకు వచ్చిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేసి అలరించాడు. ఇక ఈ సినిమాని తెలుగులో రామ్ కి నేను శైలజ లాంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఇక రామ్ బాబాయ్ స్రవంతి రవికిషోర్ ఈ రీమేక్ రైట్స్ కొనగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నివేతా పెతురాజ్ ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. గతంలో కిషోర్ తెరకెక్కించిన చిత్రలహరిలో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించిన నివేతా పెర్ఫార్మెన్స్ నచ్చడంతో ఈ సినిమాకి కూడా ఆమెనే ఫైనల్ చేసి నట్టు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ప్రచారం అయితే మొదలయ్యింది.  పెద్ద స్టార్స్ లేకపోయినా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ పరంగా బాగుండడంతో సూపర్ హిట్ అయ్యింది. అందుకే రామ్ తన ఫ్యాన్ బేస్ కూడా కలిసి వస్తుందనే అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Related Stories