English   

ఎంత మంచి వాడవురా రావణా 

Kalyan Ram
2019-07-05 12:31:30

నందమూరి హీరోగా ఎంట్రీ ఇచ్చినా అంతగా కెరీర్ ని నిలబెట్టుకోని వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. హరికృష్ణ రెండో కొడుకయిన ఈయన అప్పుడెప్పుడో అసాధ్యుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత హిట్స్ అనేవే ఎరుగక నాలుగేళ్ల క్రితం పటాస్ అనే సినిమా వచ్చే వరకూ సినిమాల మీద దండయాత్రలు చేస్తూనే వెళ్ళాడు. ఇక ఆయన తాజాగా హీరోగా వచ్చిన 118 అనే సినిమా కూడా హిట్ కొట్టడంతో కాస్త ఫాంలోనే ఉన్నాడు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి సతీష్ వేగేశ్నతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా మరొకటి మల్లిడి వేణు అనే నూత్జన దర్శకుడితో మరో సినిమా. అయితే ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేపధ్యంలో ఆయన సతీష్ వేగేశ్నతో తెరకెక్కించే సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఎంత మంచి వాడవురా అనే టైటిల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ప్రకటించింది. కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ నటిస్తున్న ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మళయాళ స్వర బ్రహ్మ గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.  గతంలో ఎమ్మెల్యే - మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి కాస్తా ఇప్పుడు ఎంత మంచి వాడవిరా అయ్యాడు. ఇక ఈయన నటిస్తున్న వేణు దర్శకుడిగా ఉన్న సినిమాకి రావణ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

More Related Stories