English   

రాజు గారి గదిలోకి వెళ్ళేది ఎవరో ?

Kajal Aggarwal
2019-07-05 13:24:32

తాజాగా రాజుగారి గది సిరీస్ లో భాగంగా మూడో భాగం సినిమాని దర్శకుడు ఓంకార్ అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఓపెనింగ్ సమయంలో అక్కడ తమన్నా హల్చల్ చేయడంతో ఆమె హీరోయిన్ అని అనుకున్నారు. ఈ విషయాన్ని యూనిట్ కూడా ధృవీకరించడంతో అందరూ ఆమెనే హీరోయిన్ అనే ఫిక్స్ అయిపోయారు. అయితే తాజాగా ఆమె ఈ సినిమా నటించడం లేదనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. ఆమెకు ముందు కధ మొత్తం చెప్పలేదని, ఆమె పాత్రవరకే చెప్పి ఒప్పించారని, ఆ తర్వాత సెట్స్ మీదకి కధ చెబితే కధ నచ్చలేదని కొన్ని కరెక్షన్స్ చెప్పారని దానికి ఒప్పుకోని ఓంకార్ ఏమీ మార్చానని చెబితే వాకౌంట్ చేసిందని ఒక ప్రచారం. లేదు ఆమెకి బాలీవుడ్ సినిమా డేట్స్ కుదరక ఈ సినిమా వదులుకుందని మరో ప్రచారం జరిగాయి. అంతేకాక ఈ సినిమాలో అప్పుడే తాప్సీని ఓకే చేసేసారని కూడా ఈ ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ సినిమా ఆఫర్ కాజల్ ని వరించిందని చెబుతున్నారు. తాప్సీ, సమంతా, తమన్నా వీరంతా హారర్ కి పాత అయిపోయారని కాజల్ అయితే కొత్త్తగా ఉంటుందనే ఉద్దేశంతో కాజల్ ని కలిసి కధ చెప్పగా, ఇప్పటిదాకా ఈ జానర్ లో సినిమా చేయని కాజల్ కూడా వెంటనే ఓకే చెప్పెసిందని అంటున్నారు. అయితే ఇలా ఎన్ని ప్రచారాలు జరిగినా అసలు తమన్నా తప్పుకున్నట్టే ఇంకా యూనిట్ నుండి ప్రకటన రాలేదు, ఆ యూనిట్ నుండి ప్రకటన వస్తే కానీ ఈ గదిలోకి వెళ్ళే హీరోయిన్ ఎవరు అనే దాని మీద క్లారిటీ రాదన్న మాట. 
 

More Related Stories