మిథాలీ రాజ్ బయోపిక్....హీరోయిన్ గా తాప్సీ

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని బయోపిక్ సినిమాలు నిర్మాతలకి లాభం తెచ్చిపెట్టడమే కాక మంచి పేరు కూడా తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఈ బయోపిక్స్ మీద ద్రుష్టి పెడుతున్నారు తెలుగు డైరెక్టర్స్. సినీ, రాజకీయ, స్టోర్ట్స్ పర్సన్స్, పద్మశ్రీ అవార్డీలు ఇలా ఒకరు కాదు దాదపు అందరి మీదా ఈ సినిమాలు ఫోకస్ చేస్తున్నాయి. క్రీడారంగానికి చెందిన బయోపిక్స్‌పై అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ సింధుల బయోపిక్స్ ని కూడా తెరకెక్కించే పనిలో ఉండగా భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలోను ఓ సినిమాని నిర్మించాలని ప్లాన్ చేసింది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ వయాకామ్ 18. ఇటీవల మిథాలీని కలిసిన వారు మిథాలి జీవితంలోని ముఖ్యమైన అంశాలని తీసుకొని స్క్రిప్ట్ గా రూపొందిస్తున్నారని ఏడాది క్రితమే ప్రచారం జరిగింది. మిథాలీ రాజ్ భారత్ మహిళా క్రికెట్ కెప్టెన్‌గా ఉండడమే కాక ఒంటి చేత్తో ఎన్నో విజయాలని అందించింది. ఆమె జీవిత నేపథ్యంలో రూపొందనున్న చిత్రం భారీ విజయం సాధిస్తుందని నిర్మాతలు భావించి ఆమె పోలికలు ఉన్న నటి కోసం వెతికి చివరికి ఏమనుకున్నారో ఏమో కానీ మిథాలీ పాత్ర కోసం తాప్సీని ఎంచుకున్నారని అంటున్నారు. అయితే తాప్సీకి క్రికెట్ కొత్త కావడంతో ఈ సినిమా కోసం నేర్చుకునే పనిలో పడిందట. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. నిజానికి తాప్సికి హాకీ అంటే ఇష్టమట, కానీ ఈమె షూటర్ గాను, క్రికెటర్ గాను నటించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈమె దేశంలో మొదటి షూటర్స్ చంద్రో తోమర్స్ బయోపిక్‌లో కూడా నటిస్తోంది.