English   

సంపూ సినిమాకి సెన్సార్ పూర్తి...ఎటకారం తగలెయ్య

kobari
2019-07-05 21:41:20

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమమట్ట. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజేష్ అదేనండీ హృదయ కాలేయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  2015 నుండే కొబ్బరిమట్ట పోస్టర్స్, టీజర్స్ తో త్వరలో విడుదల అంటూ ఊరిస్తున్న ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ ని జూలై 21న రిలీజ్ చేస్తునట్టుగా ప్రకటిస్తూ ఈ మధ్య ప్రమోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది సినిమా యూనిట్. నాలుగేళ్ళ తర్వాత విడుదల అవుతున్న చిత్రం సినిమా కావడంతో సంపూ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ రోజు కొబ్బరిమట్ట సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుందట. ఈ సినిమాకి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారట సెన్సార్ సభ్యులు. ఈ విషయాన్ని కూడా ఏటకారంగా ఒక బుడ్డోడు నగ్నంగా ఉన్న పిక్ పెట్టి మా తమ్ముడు పెద్ద---అయిపోయాడు అంటూ పిక్ రిలీజ్ చేశారు. సంపూ ఎటకారమా మజాకా ?

More Related Stories