English   

టాయిలెట్ ని కూడా వదలుకుండా సందీప్ కిషన్ సినిమా ప్రమోషన్స్

sundeep
2019-07-05 21:50:27

కుక్కపిల్ల సబ్బు బిళ్ళ ఆడపిల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో మహా కవి. ఆయన మాటలు సీరియస్ గా తీసుకున్నారో ఏమో కానీ అలాగే సినిమా ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు మనోళ్ళు. హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా నిను వీడని నీడను నేనే. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే కుర్రాళ్ళు వాడిన ప్రమోషన్ టెక్నిక్ చూస్తే నిజంగా వారు  కవి శ్రీశ్రీని ఫాలో అవుతున్నారని చెప్పక మానరు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రం కోసం వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఏకంగా థియేటర్లలోని టాయిలెట్ లను కూడా ఈ మూవీ టీం వదలడం లేదట. టాయిలెట్లకు వెళ్లిన వాళ్లు అక్కడి పోస్టర్లు చూసి సిగ్గుపడిపోతున్నారు. దానికి కారణం నవ్వు వచ్చేలా ఆ సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన బోర్దులే, 'కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త.. నిను వీడని నీడను నేనే.. జూలై 12న వచ్చేస్తున్నా', 'నాకు హారర్ ఫిల్మ్స్ అంటే భయం. ఫాస్ట్‌గా జిప్ మూసెయ్. నిను వీడని నీడను నీనే', 'అద్దంలో చూసుకున్నప్పుడు జాగ్రత్త.. దెయ్యాలు ఉంటాయి-నిను వీడని నీడను నేనే' అని రాసిన పోస్టర్స్ వారికి కనిపిస్తున్నాయి. మళ్ళీ ఎక్కడో మారుమూల ఊర్లో ఈ పోస్టర్స్ అంటించారు అనుకునేరు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఐమాక్స్ థియేటర్స్‌లోని టాయిలెట్స్‌లో ఈ పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. టాయిలెట్ కి కూడా వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారంటే హిట్ కోసం ఎంత పరితపిస్తున్నారో మరి.

More Related Stories