English   

ఎట్టకేలకి గుమ్మడి కాయ కొట్టేశారు

puri
2019-07-05 22:01:05

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ పార్ట్ ఈరోజుతో పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టేశారు. షూట్ పూర్తి కాక మునుపే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. ఇక ఈరోజుతో షూట్ పూర్తి కావడంతో పూర్తిగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చుంటారు. ఇక ఈ సినిమాను జులై 18 న విడుదల చేస్తామని ఇప్పటికే ఫిలిం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు 'ఇస్మార్ట్ శంకర్' గుమ్మడికాయ కొట్టిన ఫోటోలను పూరి కనెక్ట్స్ సమస్త ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ 'ఇట్స్ ఎ రాప్' అంటూ షూటింగ్ పూర్తయిన సంగతిని ప్రకటించారు. ఈ ఫోటోలలో రామ్, నభ, పూరి జగన్నాధ్, ఛార్మీతో పాటు సినిమా యూనిట్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్, హీరో, హీరోయిన్లు అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. సో ఈ సినిమా హిట్ కావడం వీరందరికీ చాలా అవసరం.  రామ్ పూర్తిగా తన మేకోవర్ మార్చి మరీ ఈ సినిమా చేస్తున్నారు.

 

More Related Stories