English   

తప్పు బాలాది కాదట....తమిళ్ అర్జున్ రెడ్డి షాకింగ్ న్యూస్ ?

tamil
2019-07-05 22:12:13

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలియనిది కాదు. ఆ క్రేజ్ తో ఈ సినిమాని వేరే బాషలలోకి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని బాలీవుడ్ లోకి కబీర్ సింగ్ గా రీమేక్ చేసి రిలీజ్ చేయగా అది సెంచరీ కొట్టి మరిన్ని రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాని తమిళంలో ఆదిత్య వర్మ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. గతంలో బాలా దర్శకత్వంలో వర్మ పేరుతో ఈ సినిమా చిత్రీకరించగా అది సరిగా రాలేదని చెబుతూ దర్శకుడిని తప్పించి మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ సినిమాక్ సంబంధించి తమిళ నాట జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే  నిజానికి ఈచిత్రాన్ని ఈనెలలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ టీజర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివిటీ చూసిన నిర్మాతలు అసలు ఈ సినిమాని ధ్రువ్‌ ను లీడ్ గా పెట్టి ఈ సినిమా తీయడమే తప్పని అనవసరంగా బాలాని తప్పించి మళ్ళీ షూట్ చేశామని, కానీ సమస్య బాలాది కాదని ధృవ్ లుక్ అని నిర్మాతలు అనుకుంటున్నారని వినికిడి. ఈ నేపధ్యంలోనే ఆదిత్య వర్మ రిలీజ్ చేస్తే జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఇలాంటి సినిమాతో కెరీర్ మొదలైతే అతడి మీద ఓ నెగటివ్ ఇంప్రెషన్ పడుతుందని విక్రమ్ భావిస్తున్నాడట. అందుకే ఈసినిమాను పక్కన పెట్టేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. దీని మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

More Related Stories