English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త లుక్కుపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు.. 

Pawan Kalyan
2019-07-06 10:08:21

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ లుక్ మార్చేసాడు. ఈయ‌న లుక్ మార్చేస్తే చాలు అభిమానులు కూడా గాల్లో తేలిపోతుంటారు. తాజాగా ఈయ‌న తానా స‌భ‌ల‌కు వ‌చ్చాడు. అక్క‌డ ఆయ‌న్ని చూసి ఫ్యాన్స్ అంతా ఒక్క‌సారిగా ఫిదా అయిపోయారు. త‌మ అభిమాన హీరో మ‌ళ్లీ సినిమాలు కానీ చేస్తున్నాడా ఏంటి అని ఆస‌క్తిగా చూస్తున్నారు. ఎందుకంటే పంజా సినిమా స‌మ‌యంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ప‌వ‌న్ అలా ఉన్నాడు మ‌రి. అది చూసిన త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా అనే అనుమానం అంద‌ర్లోనూ వ‌స్తుంది. ఒక‌ప్పుడు సినిమా హీరోలా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య పూర్తిగా రాజ‌కీయ నాయ‌కుడు అయిపోయాడు. మ‌ళ్లీ ఇప్పుడు సినిమా హీరో అయిపోయాడు. త‌ను సినిమాలు చేయ‌న‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా కూడా ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఏదో ఓ సినిమా అయితే క‌చ్చితంగా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఈయ‌న కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి. కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని ఆ మ‌ధ్య ఓ వేడుక‌లో నిరూపించారు ఈ ఇద్ద‌రు. ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది. దానికి తోడు ప‌వ‌న్ సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా క‌చ్చితంగా చెబుతున్నారు. అంటే క‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ళ్లీ సినిమాల్లో ఊహించొచ్చు. పైగా ప‌వ‌న్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ అయితే ఇవ్వ‌లేదు. బ్రేక్ ఇస్తున్నాన‌ని చెప్పాడంతే. కానీ ఈ మ‌ధ్య మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పాడు. ఈ క‌న్ఫ్యూజ‌న్ లో అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌ట్నుంచి రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఉండే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది తేల‌నుంది. మొత్తానికి ఈ కొత్త లుక్ సినిమాల‌కే సంకేతం అవుతుందేమో చూడాలిక‌.

More Related Stories