English   

సమంతాకి కంగనా టీమ్ నుండి విషెస్

Rangoli Chandel
2019-07-06 10:24:37

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత మీద బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ప్రశంసల జల్లు కురిపించింది. సమంతా నటించిన 'ఓ బేబీ' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో శామ్‌ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుందని పేర్కొంటూ పింక్ విల్లా అనే వెబ్ సైట్ ఒక కథనం రాసింది. ట్విటర్‌లో నెటిజన్ల ట్వీట్లు, వీడియోలను బేస్ చేస్తూ ఈ వార్తను ప్రచురించింది. ఈ వార్తను రీట్వీట్‌ చేసిన రంగోలీ ''ఓ బేబీ' అద్భుతమైన విజయం అందుకుంది. సమంత అసలుసిసలైన ఫెమినిస్ట్‌. ఆమె జీవితం ఓ సక్సెస్‌ స్టోరీ. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆమె తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుందని ఆమె ప్రశంసించింది. ఇలాంటి దేవతల్ని మేం మెచ్చుకుంటాం. కంగన టీమ్ నుంచి మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నామని రంగోలీ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన సమాంత మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలని ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చింది. ఇక సమంత ఓ బేబీ సినిమాకి సోషల్‌ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఓ బేబీ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందిన త‌ర్వాత స‌మంత ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోందని అక్కినేని అభిమానులు సంబర పడుతున్నారు.

More Related Stories