English   

రకుల్ ప్రీత్ కి ముంబైలో చేదు అనుభవం 

Rakul Preet
2019-07-06 10:39:08

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే హిందీలో 'దే దే ప్యార్ దే' అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అందుకే ఆమె ముంబైలోనే తిష్ట వేసి ఇప్పుడున్న క్రేజ్ ని వాడుకోవాలని చూస్తోంది. అయితే ఆమెకు తాజాగా ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న ఫార్మర్స్ కేఫ్ రెస్టారెంట్ కి ఆమె అక్కడ ఏదైనా తినడానికి వెళ్లిందో ఏమో కానీ తినేసి బయటకు వచ్చి కారు ఎక్కబోతుండగా అక్కడ భిక్షాటన చేస్తున్న కొందరు పిల్లలు, మహిళలు ఆమె చుట్టూ చేరి డబ్బులు ఇమ్మనమని బలవంతపెట్టారు. అయితే వారు రకుల్ మీద పడి చేతులు కూడా వేస్తుండడంతో ఆమె కాస్త అసహనానికి లోనయ్యింది. రకుల్ వారి నుంచి తప్పిచుకోవాలని ప్రయతించినా ఆమెకి కుదర్లేదు. ఇంతలో అక్కడికి రెస్టారంట్ సిబ్బంది వచ్చి అక్కడున్న వారిని కంట్రోల్ చేయడంతో రకుల్ కారెక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి ఘటనలు మామూలే అయినా ఒక్కోసారి కోపం వచ్చి వారిని ఏమైనా అంటే మళ్ళీ మీడియా ఏకి పారేస్తుంది. మానవత్వం లేని రకుల్ అంటూ కధనాలు సైతం వండి వారుస్తారు. కానీ అక్కడ అసలు ఇబ్బంది ఏమిటో పడ్డ వారికే కదా తెలిసేది.

More Related Stories