English   

ఎవరికీ చెప్పోద్దంటున్న దిల్ రాజు 

Dil Raju
2019-07-06 11:18:54

మంచి సినిమాల‌ను జనాలకి అందించాలని తపన పడే నిర్మాత‌ల్లో దిల్‌రాజు కూడా ఒక‌రు. చిన్న సినిమాల‌కు, కొత్త డైరెక్టర్ లకు ఆయ‌న ఇచ్చే సపోర్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. హిట్ సినిమాల నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు మరో చిన్న సినిమాకి చేయూతనిస్తున్నాడు. ఆ సినిమా పేరే ఎవరికీ చెప్పొద్దు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరోహీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆగష్టు 2న రెండు సినిమాలు డేట్ లాక్ చేసుకున్నాయి. అలాగే సాహో కూడా రిలీజ్ కి ఉంది మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమో ? కానీ పోస్టర్స్ తో సినిమా మీద ఆసక్తి రేకెత్తించడంలో మాత్రం సినిమా యూనిట్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
 

More Related Stories