English   

విజయ్ సినిమాలో హీరోయిన్స్ ని తప్పించారా ?

Vijay
2019-07-06 11:56:37

తమిళ ఇళయదళపతిగా ఫేమస్ అయిన  స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తండ్రిగా, కొడుకుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూట్ లో ఉండగానే విజయ్ తన తదుపరి సినిమాని కూడా పట్టాలు ఎక్కించేందుకు సిద్దమయ్యాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన  త్రిష, రకుల్ ప్రీత్ లు నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం నిజం కాదని అంటున్నారు. 96తో ఫాంలోకి వచ్చినా సరే విజయ్ సరసన త్రిష వద్దనుకున్న యూనిట్ వేరే హీరోయిన్ వేటలో పడిందట, ఇదే సమయంలో రకుల్ కూడా ఏదో కారణంతో తప్పుకుంటానని చెప్పడంతో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ని వెతికే పనిలో పడింది యూనిట్. అయితే విజయ్ సరసన ఓ ఇద్దరు యంగ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది కన్నడ భామ రష్మిక మందన్న పేరు కాగా, రెండో పేరు రాఖీఖన్నాది. తాజాగా వీరిద్దరినీ యూనిట్ సంప్రదించిందని ఇద్దరూ డేట్స్ ఇస్తామని చెప్పారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే కానీ దేనినీ నమ్మలేము. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories