English   

ఓ బేబీ విషయంలో సమంత గెలిచిందా.. సురేష్ బాబు గెలిచాడా..

Samantha
2019-07-06 18:52:26

ఇప్పుడు ఇదే విషయంపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఎందుకు ఆ స్థాయి చర్చలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా.. దానికి ఒక కారణం ఉంది.. దాని వెనుక ఒక కథ కూడా ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే మొదలుపెట్టిన రోజు నుంచి విడుదలైన రోజు వరకు నిర్మాత సురేష్ బాబుకు దీనిపై పెద్దగా అంచనాలు కానీ.. ఆశలు కానీ.. ఆసక్తి గానీ లేదు. అసలు ఈ సినిమా రీమేక్ చేయడమే ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. రీమేక్ రైట్స్ తీసుకున్న రోజు నుంచి సినిమా విడుదలయ్యేంత వరకు ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు.. సరికదా సినిమా సెట్స్ పైకి వెళ్లే రెండు రోజుల ముందు కూడా రీమేక్ ఆపేద్దామని దర్శకురాలు నందిని రెడ్డికి సురేష్ బాబు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆతర్వాత కూడా ఆయన సినిమా ప్రొడక్షన్ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు.. ఇలాంటి కథ తెలుగులో వర్కౌట్ కాదు అని ఆయన ముందు నుంచి అనుకుంటున్నాడు. 

కాకపోతే సమంతకు మాత్రం ఓ బేబీ కథపై ఎక్కడలేని నమ్మకం ఉంది. అందుకే సురేష్ బాబుని ఒప్పించి మరి ఈ సినిమాను పట్టాలెక్కించింది. పూర్తిచేసింది చేసింది ఇప్పుడు. సినిమా విడుదలైంది.. ఓ బేబీకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ సినిమాకు అతి ముఖ్యమైన కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా వెనకబడింది. కథ విషయంలో.. ప్రశంశల విషయంలో సమంత గెలిచింది. కానీ కమర్షియాలిటీ విషయంలో మాత్రం సురేష్ బాబు అనుభవమే గెలిచింది అంటున్నారు అభిమానులు. ఆయన చెప్పినట్లు నిజంగానే తెలుగులో ఓ బేబీ ఇలాంటి కథ వర్క్ ఔట్ కావడం కాస్త కష్టమే. ఎంత అద్భుతంగా చెప్పాలని ప్రయత్నించినా కూడా ఎక్కడో ఎమోషన్ మిస్ కావడంతో ఓ బేబీ మాస్ ఆడియన్స్ ను అలరించడంలో విఫలమవుతుంది. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ బేబీ చెంతకు వస్తున్నారు. దాంతో ఇప్పుడు ఓ బేబీ విషయంలో సమంత గెలిచిందా సురేష్ బాబు గెలిచాడా అనే విషయంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతుంది.

More Related Stories