English   

నాగార్జున కావాలని చేస్తున్నాడా.. నిజంగానే రిస్క్ చేస్తున్నాడా..

Nagarjuna
2019-07-06 20:48:57

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు కాస్త క్రేజ్ పడిపోయింది. మార్కెట్ కూడా తగ్గిపోయింది. ఒక చిరంజీవి మాత్రమే ఇప్పటికీ తన సత్తా చూపిస్తున్నాడు. పదేళ్ల తర్వాత వచ్చినా కూడా ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆయనను రియల్ మెగాస్టార్ అనిపించేలా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించింది. ఇదిలా ఉంటే నాగార్జున కూడా మూడేళ్ల కింద వరకు వరుస విజయాలతో సత్తా చూపించాడు కానీ ఈ మధ్య ఆయనకు సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు. ప్రస్తుతం మన్మధుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. ఆగస్టు 9న మన్మధుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్య విడుదలైన టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. 60 ఏళ్ల వయసులో నాగార్జున చేసిన రొమాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. దానికి తోడు లిప్ లాక్ సీన్స్ కూడా చేశాడు ఈ ముదురు మన్మథుడు. 

కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేస్తున్నారు. సమంత అక్కినేని కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కావడం ఇప్పుడు నాగార్జున అభిమానులను కలవర పెడుతుంది. దానికి ప్రత్యేకంగా కారణం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆగస్టు 15న ప్రభాస్ సాహో సినిమా విడుదల కానుంది. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా సాహో కోసం వేచి చూస్తోంది. ఆ సినిమా వచ్చిన తర్వాత థియేటర్లో ఏ సినిమా ఉన్న ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ సాహూకు పాజిటివ్ టాక్ వస్తే మన్మధుడు జర్నీ ఒక వారంలోనే ముగిసిపోవడం ఖాయం. ఇది తెలిసి కూడా ముందడుగు వేస్తున్నాడు నాగార్జున. కచ్చితంగా మన్మధుడు 2 బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందని.. సాహో వచ్చినా కూడా తన సినిమా ఆడియన్స్ తనకు ఉంటారు అంటున్నాడు ఈ గ్రీకు వీరుడు. మరి ఈయన నమ్మకాన్ని మన్మధుడు ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.
 

More Related Stories