English   

మహేష్ సినిమాలో ట్రైన్ సెట్...దాన్ని ట్రై చేస్తారట ?

mb
2019-07-07 07:33:48

రవితేజ నటించిన వెంకీ సినిమా అంతా ఆడలేదు కానీ అందులోని ట్రెయిన్‌ ఎపిసోడ్‌ మాత్రం బాగా పేలింది. ఇప్పటికీ చాల మంది ఆ ట్రెయిన్‌ సీన్స్ కోసమే సినిమా చూస్తారు అంటే అతిశయోక్తి కాదేమో ? శ్రీను వైట్ల కామెడీలో అదొక మరపురాని విధంగా తెరకెక్కించాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు అనిల్‌ రావిపూడి మళ్ళీ అదే టైప్ ఆఫ్ కామెడీని ప్రెజెంట్ చేయనున్నాడని సమాచారం. అది సూపర్ స్టార్ మహేష్ బాబు - రష్మిక జంటగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ కోసమేనట. ఈ సినిమా కోసం భారీ బడ్జెటే పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణే ట్రెయిన్ సెట్ ఖర్చు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ ని జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ హైదరాబాద్ కు రానున్నారు. రెండో షెడ్యూల్ గా అన్న పూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన ట్రెయిన్ సెట్ తో షూట్ చేయబోతున్నారు అని సమాచారం. ఇక ఇందులో మహేష్ - రష్మిక- రాజేంద్ర ప్రసాద్ - బండ్ల గణేష్ లాంటి వారి మీద కామెడీ సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ ట్రెయిన్ సెట్ లో నిమిషాల పాటు లెంగ్తీగా సాగే సీన్స్ ను తెరకెక్కించబోతున్నారట. అందుకే ప్రత్యేకంగా ట్రైన్ సెటప్ చేయిస్తున్నారని అంటున్నారు. మరి దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందనుకోండి.

More Related Stories