English   

ఓర్నీ జక్కన్న అమెరికా వెళ్ళింది అందుకా ?

rajamouli
2019-07-07 07:50:24

తెలుగు సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్ర రాజాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ సినిమా మొదలయిన నాటి నుండి ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఈ సినిమా మీడియాలో నానుతూనే ఉంది. సినిమా క్యాస్టింగ్ మొదలు అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. గాయాలు పాలయిన ఇద్దరు హీరోలూ చక్కగా ఫాంలోకి వచ్చారు కాబట్టి ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుందని భావించారు. కానీ అదేంటో ఎప్పుడూ పని పని అంటూ పని రాక్షసుడులాగా చేసే రాజమౌళి ఏకంగా వారం రోజుల పాటు సెలవు పెట్టి మరీ అమెరికా వెళ్ళాడు. పైగా తానా సభలు జరుగుతున్నాయి కాబట్టి తాను వస్తున్నాన్నని అనుకుంటారేమో అని పర్సనల్ పనుల కోసం వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కూడా. అయితే ఆయన ఏదో సినిమా పని మీదనే వెళ్లి ఉంటాడని అనుకున్నారు, అయితే ఆయన వెళ్ళింది ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దానికి రీజన్ ఆయన అక్కడికి వెళ్ళింది తన అన్న కీరవాణి పుట్టిన రోజు ను వేడుకలా జరపడానికట. నిజానికి కీరవాణి తానా సభలకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ కార్యక్రమానికి వెళ్ళడం క్యాన్సిల్ చేయడం కుదరదు కాబట్టి షూట్ ఆపేసి మరీ అక్కడికి వెళ్లాడట జక్కన్న. అన్నా దమ్ముల అనుబందం అని సినిమాల్లో చూడడమే కానీ రియల్ గా ఉంటే ఇలానే ఉంటుందేమో ?

 

More Related Stories