English   

బందోబస్త్ టీజర్...పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు !

ban
2019-07-07 08:06:01

తమిళ స్టార్‌ సూర్య నటిస్తున్న తాజా సినిమా కాప్పాన్, ఈ సినిమాని తెలుగులో బందోబస్త్‌ పేరుతో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు సాయంత్రం టీజర్‌ రిలీజ్  చేశారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సూర్య రకరకాల గెటప్‌ లలో కనిపించి ఆకట్టుకున్నారు. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్‌గా విభిన్న పాత్రల్లో కనిపించారు ఆయన. ఉగ్రవాదం, సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. 'వాడి చూపు, మాట, ప్రవర్తన.. ఏదీ కరెక్ట్‌ కాదు..' అనే సాయేషా డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. 'మీరు రెచ్చగొట్టింది ప్రశాంతంగా నిద్రపోతున్న పులిని. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు..' అని మోహన్‌లాల్‌ ఓ వ్యక్తిని హెచ్చరిస్తూ కనిపించారు. 'పోరాడటం తప్పంటే.. పోరాడే పరిస్థితి ఏర్పరచడం కూడా తప్పే కదా..' అని సూర్య అంటే.. 'మీరేంటి నక్సలైట్‌లా మాట్లాడుతున్నారు' అని ఓ రాజకీయ నాయకుడు అనడం ఈ టీజర్లో కనిపించింది.  ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తెలుగు టీజర్ మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

More Related Stories