English   

బిగ్ బాస్ కోసం జాబ్ వదిలేసిన బిత్తిరి సత్తి అక్క

anchor
2019-07-07 08:43:39

త్వరలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ హోస్ట్ చేసేది నాగార్జున అని క్లారిటీ అయితే వచ్చేసింది. కానీ ఎప్పటి నుండి ? అలాగే పార్టిసిపెంట్స్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దీని మీద కొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒక పేరు తీన్మార్ యాంకర్ జ్యోతి. అలా అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు, కానీ బిత్తిరి సత్తి అక్క సావిత్రి అంటే గుర్తు పడతారు. వీ6 ఛానల్ లో తీన్మార్ కార్యక్రమంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది సావిత్రి. బిత్తిరి సత్తి - సావిత్రి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. సదరు ఛానల్ కు ఇదే ఆయువు పట్టు అన్నా అతిశయోక్తి కాదేమో ? అయితే ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ 3లో అవకాశం రావడంతో జాబ్ మానేసి మరీ అందుకోసం వెళుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఛానెల్ వారు మూడు నెలల సెలవు ఇస్తామన్నారనీ బహుశా ఈ షో పూర్తయ్యాక మళ్ళీ ఆమె వెళ్లి షో చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే ఆమె బిగ్ బాస్ కి రావడం అయితే పక్కా అయినట్టే అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ?

More Related Stories