English   

బాలీవుడ్ క్రిటిక్స్ ని ఏకి పారేసిన సందీప్ రెడ్డి

sundeep
2019-07-07 10:05:59

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ను రిలీజ్ రోజున బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటే అక్కడి క్రిటిక్స్ మాత్రం ఏకి పారేశారు. సినిమాని ఒకే యాంగిల్ లో చూశారో లేక ఎవడో సౌత్ ఇండియన్ తీసిన సినిమాకి రేటింగ్ ఎక్కువ ఇవ్వడం అవమానంగా భావించారో తేలీదు కానీ దాదాపు అందరూ 2 ఇచ్చారు. రేటింగ్ ఇవ్వడమే కాక ఈ సినిమా చెత్త సినిమా అని కొందరు, ఆడవాళ్ళను నీచంగా చూపారని కొందరు తేల్చేశారు. అయితే వాళ్ళందరి నోళ్ళు మూయించేలా బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రోజులు తిరక్కుండానే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్బులోనూ అడుగుపెట్టింది. బాలీవుడ్ కి చెందిన కొందరు ఫెమినిస్ట్ క్రిటిక్స్ ఇది పురుషాధిక్యాన్ని చాటే సినిమా అని మహిళల్ని తక్కువగా చూపించారని విమర్శించారు. ఈ విమర్సాలకి విమర్శకులకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దీటుగా బదులిచ్చాడు. ఈ కబీర్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లు సూడో ఫెమినిస్టులని వాళ్లకు ఫెమినిజం అంటే అర్థం తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాక కబీర్ సింగ్ ను విమర్శించిన క్రిటిక్స్‌ను పేర్లు పెట్టి మరీ తిట్టాడు. ఈ సినిమాపై ఏకపక్షంగా విమర్శలు చేశారంటూ క్రిటిక్స్‌ను ఏకి పారేశాడు. బాలీవుడ్ లో తానో లెజెండరీ క్రిటిక్ గా ఫీల్ అయ్యే రాజీవ్ మసంద్‌ 'కబీర్ సింగ్'కు 2 స్టార్ రేటింగ్ ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. ఆయన లావుగా ఉంటారని చెడుగా మాట్లాడితే తప్పేనని ఆయనలో ఉండే ఇతర పాజిటివ్ అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని సందీప్ పరోక్షంగా ఏకేశారు. ఇక పనికొచ్చే విమర్శలు చేస్తే తాను అంగీకరిస్తానని సినిమాను కించపరిచేలా మాట్లాడే వాళ్లు క్రిటిక్స్ ఎలా అవుతారని సందీప్ ప్రశ్నించాడు. 

More Related Stories