English   

తెలుగులో టెంపర్ తమిళ్ రీమేక్...అవసరమా విశాల్ ?

vishal
2019-07-07 10:45:11

జూనియర్ ఎన్టీఆర్ కి కెరీర్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిన టెంపర్ సినిమాని ఈ మధ్యనే విశాల్ హీరోగా తమిళ్ లో అయోగ్య పేరుతో రీమేక్ అయ్యి అక్కడ రిలీజయ్యి బాగా ఆడిన సంగతి తెలిసిందే. దీని షూటింగ్ మొదలుకాక ముందే అయోగ్యను తెలుగులో డబ్బింగ్ చేయమని చెప్పిన విశాల్ ఇప్పుడు మాట మార్చి మళ్ళీ దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నటనలో తారక్ తో పోలిక పెడతారు కాబట్టి ఆ విషయంలో తాను పోటీ పడలేనని గతంలో చెప్పిన విశాల్ ఇప్పుడు అయోగ్యను తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 12న హడావిడిగా విడుదల చేస్తున్నారు. అయితే క్లైమాక్స్ తప్ప మిగిలినదంతా టెంపర్ సినిమాని మక్కీకి మక్కి ఎక్కించిన అయోగ్య సినిమాని తెలుగు వాళ్ళు కనెక్ట్ అవుతారా అనేది ఆలోచించాల్సిన విషయమే. అదీ కాక 12న విపరీతమైన పోటీ ఉంది. దొరసాని-నిను వీడని నీడను నేనే-రాజ్ దూత్ లతో పాటు హృతిక్ రోషన్ సూపర్ 30 సినిమా కూడా ఆరోజునే రిలీజ్ అవుతున్నాయి. ఇక మొన్న రిలీయినా ఓ బేబీ కూడా భీబత్సమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఆడుతోంది. దీంతో ఈ సినిమాకోసం థియేటర్ లు కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అయోగ్యను తీసుకురావడం అనేది మతి లేని చర్య అని విశ్లేషకులు చెబుతున్నారు.   త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా క్లైమాక్స్ తీశామని చెబుతున్నారు కాబట్టి ఏమైనా అవకాశం ఉండచ్చేమో ?

More Related Stories