English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

prabhas
2019-07-07 11:00:35

బాహుబలి తర్వాత స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా షూట్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మద్యనే చలి దేశమైన ఆస్ట్రియాలో పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇక మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా వీలయినంత త్వరలో పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడంతో శరవేగంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని మొదటి పాటను ఈనెల 8న విడుదల చేస్తామని ప్రకటించారు. ‘సైకో సయ్యాన్..’ అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్‌ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ పాట కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ పాటను హైదరాబాద్‌ లోని ఐమాక్స్ లో ప్రభాస్ స్పెషల్ ఫ్యాన్స్ అయిన ఒక 300 మందికి ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందరికీ యూట్యూబ్‌లో విడుదల చేసే ముందే ప్రభాస్ అభిమానులు ఈ పాటను చూడబోతున్నారన్నమాట. అయితే ఆ 300 మంది స్పెషల్ ఫ్యాన్స్ ఎవరనే విషయం మాత్రం క్లారిటీ లేదు. సినిమా ప్రమోషన్‌స్ ని కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నంలో భాగం లో భాగంగా ఇలా చేస్తున్నట్లు సమాచారం.

 

More Related Stories